BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 08:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిజిఆర్‌ఎస్‌ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 08:39 PM
26 వీక్షణలు

పిజిఆర్‌ఎస్‌ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి అధికారులకు జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి ఆదేశం

ఏలూరు, సెప్టెంబరు 21: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్‌ఎస్‌) ద్వారా అందుతున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేటులోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జాయింట్‌ కలెక్టరు డా. ఎం.జె. అభిషేక్‌ గౌడ, అసిస్టెంట్‌ కలెక్టరు సి.హెచ్. శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం. ముక్కంటి, విజిలెన్స్‌ ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు ఎల్. దేవకీదేవి, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పిజిఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లలో స్వీకరించిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు అందించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించాలని సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. సమస్యలు ఎంతటి జటిలమైనవైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలని కలెక్టరు సూచించారు. ఇప్పటివరకు ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి అనే విషయాలను నిరంతరం సమీక్షించుకోవాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని, విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పిజిఆర్‌ఎస్‌లో అందిన కొన్ని అర్జీలు

కైకలూరు మండలం కైకలూరు గ్రామానికి చెందిన మండే దేవమణి కుటుంబ భూ వివాదం పరిష్కారం కోసం రీ సర్వే నిర్వహించి భూమి హద్దులు నిర్ణయించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కలపాల కృష్ణమూర్తి తనకు ఉన్న 1.75 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని, దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

చింతలపూడి మండలం యడవల్లికి చెందిన షేక్‌ మీరాభి కట్నం కోసం భర్త, అత్తమామలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు. పోలవరం మండలం జగన్నాథపేటకు చెందిన ఎస్‌.కె. సైదాని డ్వాక్రా సంఘం ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినప్పటికీ, సంఘంలోని ఒక సభ్యురాలు సొమ్ములు చెల్లించకపోవడంతో మిగిలిన సభ్యులకు రుణాలు మంజూరు కావడం లేదని, సమస్యను పరిష్కరించాలని కోరారు.

జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన సూరారెడ్డి శిలపరెడ్డి తన మొత్తం భూమిని మరోసారి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.