BREAKING
thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు
Test 4
Date of Publish : 25 November 2026, 09:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:06 AM
24 వీక్షణలు

ప్రభుత్వానికి APWJF వినతి..జర్నలిస్టులు, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి 

విజయవాడ: రాష్ట్రంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఐఏఎస్‌కు ఫెడరేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా APWJF ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ, ఇటీవల జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో సమాచార శాఖ చురుకుగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతో కీలకమైన వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం పట్ల దృష్టి సారించాలని కోరారు. గతంలో ఈ సంక్షేమ నిధి జర్నలిస్టులకు ఆపద సమయంలో అండగా నిలిచేదని, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించేదని తెలిపారు. విధి నిర్వహణలో ఉండగా లేదా ఇతర కారణాలతో జర్నలిస్టులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ నిధి కీలక పాత్ర పోషించేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షేమ నిధి కమిటీ లేకపోవడంతో జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అందాల్సిన సహాయంపై ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని ఫెడరేషన్ ప్రతినిధులు వివరించారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, పెండింగ్‌లో ఉన్న కమిటీ నియామక ప్రక్రియను పూర్తి చేసి సంక్షేమ నిధి ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, కుటుంబాల ఆర్థిక భరోసా, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు సంక్షేమ నిధి ఎంతో అవసరమని APWJF ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కమిటీని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.