BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు, నిల్వలపై ప్రభుత్వ నియంత్రణ..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 02:48 PM
31 వీక్షణలు

మిల్లర్లు, వ్యాపారులకు కఠిన నిబంధనలు స్టాక్ పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జీవో జారీ.. ఉల్లంఘిస్తే రూ.50 వేల వరకు జరిమానా ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు, నిల్వల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బియ్యం మార్కెట్‌లో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే పరిస్థితులను నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మిల్లర్లు, బియ్యం వ్యాపారులు, టోకు మరియు చిల్లర విక్రయదారులకు నిల్వల పరిమితులు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం సాధారణ ఎంటీయూ రకం బియ్యం కిలో ధరను రూ.47గా ఖరారు చేసింది. ఇతర రకాల బియ్యానికి వాటి నాణ్యత, రకం ఆధారంగా కిలోకు రూ.66 నుంచి రూ.82 వరకు ధరలు నిర్ణయించినట్లు పేర్కొంది. నిర్ణయించిన ధరలకు అనుగుణంగా విక్రయాలు జరగాలని, వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా మిల్లర్లు, వ్యాపారులు తమ వద్ద ఉన్న బియ్యం నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. నిల్వలకు సంబంధించిన వివరాలను పారదర్శకంగా ఉంచాలని, ప్రభుత్వానికి అవసరమైన సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. ప్రతి దుకాణం వద్ద బియ్యం రకం, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సంబంధించిన పట్టికను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. స్టాక్ వివరాలు నమోదు చేయకపోవడం, అధిక ధరలకు విక్రయించడం, నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉంచడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో బియ్యం మార్కెట్‌పై ప్రభుత్వ పర్యవేక్షణ మరింత పెరగనుంది. సామాన్య వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.