రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
యాదాద్రి జిల్లా: రామన్నపేట: అక్టోబర్ 9 :
తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం ఆధ్వర్యంలో రామన్నపేట మండల వార్డు మెంబర్ల ఫోరం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్,నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి శైలజ,జిల్లా ఇన్‌చార్జి ఎడుమేకల మహేష్ యాదవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామన్నపేట మండల వార్డు మెంబర్ల ఫోరం నూతన అధ్యక్షుడిగా మొహమ్మద్ అబ్దుల్ వహిద్ అంజాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు ప్రకటించారు.అధ్యక్షుడుగా మొహమ్మద్ అబ్దుల్ వహిద్ అంజాద్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాధారపు మహేష్,ప్రధాన కార్యదర్శిగా కొమ్ము రామస్వామి,ఉపాధ్యక్షుడుగా సింగణబోయిన బాలరాజు,నకిరేకల్ నియోజకవర్గ కో-ఇన్‌చార్జిలుగా చిన్నపాక రమేష్, బాషమల్ల అనిత సంతోష్ లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వార్డు మెంబర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ ముందుండాలని సూచించారు. వార్డు మెంబర్ల హక్కుల సాధన కోసం, సంక్షేమం కోసం మండల కమిటీ నిరంతరం శ్రమించాలని, అందరినీ కలుపుకొని ఫోరం బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడితో పాటు, కార్యవర్గ సభ్యులకు స్థానిక నాయకులు,వార్డు మెంబర్లు శుభాకాంక్షలు తెలిపారు.