శ్రీ ఆగిస్తిశ్వర స్వామి ఆలయ కోనేరు శుభ్రతకు ముందస్తు చర్యలు.
శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయ కోనేరు శుద్ధికి చర్యలు
పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయ కోనేరు శుద్ధి పనులకు చర్యలు చేపట్టనున్నట్లు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ తెలిపారు.
ఆలయ కోనేరు శుభ్రతలో భాగంగా రాయల్ కుమార్, మనోజ్, నానాబాల ఉదయ్, వేణు రాయల్‌తో పాటు గ్రామస్థులు కోనేరును పరిశీలించారు. అనంతరం కోనేరు శుద్ధి పనులకు సంబంధించి ఏపీవో శివశంకర్‌తో చర్చించారు. వీబీజీ రామ్‌జీ గ్రామీణ అభివృద్ధి పథకం ద్వారా సుమారు రూ.లక్ష వ్యయంతో కోనేరు శుద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పలు సమస్యలను రాయల్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆలయానికి నీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఈ సమస్యలను పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వై. మధుసూదన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాయల్ కుమార్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిన మధుసూదన్ నాయుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామస్థులు కోరారు. కోనేరు శుద్ధి పనులు పూర్తయితే ఆలయ పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కూడా ప్రయోజనం కలుగుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాయల్ కుమార్, వేణు రాయల్, నానాబాల ఉదయ్, వెంకట్ స్వామి, టీడీపీ నాయకులు తిమ్మాలయ్య, మనోజ్, పురుషోత్తం, పెద్ద అలాసాపురం, శ్రీనాథ్, నాగభూషణం, మహేష్, ప్రశాంత్, మునిరామయ్య, ఆది, మనోహర్, రవి, మణి, సోమశేఖర్, మునిస్వార, కిషోర్, ప్రభాకర్, మునెప్ప, మంజునాథ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, గ్రామస్థులు కూడా