BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు హెల్మెట్ తనిఖీల ముమ్మరం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 02:47 PM
20 వీక్షణలు

బ్లాక్ స్పాట్‌ల వద్ద విద్యుత్ దీపాలు పాఠశాల, కళాశాల బస్సులకు డాష్‌బోర్డ్ కెమెరాలు తప్పనిసరి ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్


ఏలూరు, నవంబర్ 21: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అధికారులను ఆదేశించారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని, ప్రమాదాల కారణంగా ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా చూడటమే ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జిల్లా రహదారి భద్రతా కమిటీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటికి ప్రధాన కారణాలు, ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న ప్రాంతాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా చర్చించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇకపై జిల్లాలోని ప్రధాన రహదారులపై ప్రతిరోజూ ప్రత్యేక హెల్మెట్ తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ అనేది పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ధరించే వస్తువు కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని ప్రజలు గుర్తించాలని హితవు పలికారు. సీఆర్ రెడ్డి కళాశాల వద్ద విద్యార్థులకు భద్రత ఈ నెల 2వ తేదీన సీఆర్ రెడ్డి కళాశాల సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందడం అత్యంత బాధాకరమని ఎస్పీ పేర్కొన్నారు. కళాశాల వద్ద సరైన బస్‌స్టాప్ సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు బస్సులు ఎక్కేందుకు పరుగులు తీస్తున్నారని, ఈ పరిస్థితులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వివరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కళాశాల విద్యార్థుల రాకపోకలకు అనువైన సురక్షిత ఏర్పాట్లు చేయాలని, అవసరమైన బస్‌స్టాప్ సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ, సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద వెలుగులు జాతీయ రహదారులపై ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి అక్కడ తగినంత విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో వెలుతురు లేకపోవడంతో పాదచారులు రోడ్డు దాటే సమయంలో వాహనాల ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల్లో తక్షణమే లైటింగ్ సౌకర్యాలు కల్పించి, వాహనదారులకు రహదారులు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల బస్సులకు కెమెరాలు తప్పనిసరి ప్రతి పాఠశాల, కళాశాల బస్సులో డాష్‌బోర్డ్ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఏలూరు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటనలో బస్సులోని కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కెమెరాల ఏర్పాటు వల్ల ప్రమాదాల దర్యాప్తుతో పాటు విద్యార్థుల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జాతీయ రహదారులపై వేగానికి కళ్లెం వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా జాతీయ రహదారులపై థర్మోప్లాస్టిక్ పెయింట్‌తో వేగ పరిమితి సూచికలు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల అధికారులకు సూచించారు. వాహనాల రాకపోకలు క్రమబద్ధంగా సాగేందుకు నెమ్మది వాహనాల మార్గం, వేగవంతమైన వాహనాల మార్గాలకు సంబంధించిన గీతలను స్పష్టంగా వేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని ఎస్పీ సూచించారు. రహదారులపై వాహనాలు నిలిచిపోయిన సందర్భాలను వెంటనే గుర్తించి, వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. నిరంతర పర్యవేక్షణతో ప్రమాదకర పరిస్థితులపై సత్వరమే స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) వై. ప్రసాద్ రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రవణ్ కుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హబీబ్ భాషా, డీటీఆర్‌బీ ఎస్‌ఐ కె. రాంబాబు, మధు తదితర అధికారులు పాల్గొన్నారు.