BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 08:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 08:34 AM
85 వీక్షణలు

ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు

సెప్టెంబర్ 28లోగా వివరాలు సరిచేసుకోవాలి.. లేదంటే ఓటు తొలగింపు

అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 44.89 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత, మరో 44.21 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తోంది.

ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న కొందరు ఓటర్ల వివరాలు 2002 నాటి ఓటరు జాబితాలోని వారి పేరు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల వివరాలతో సరిపోలలేదు. మరికొందరి వివరాల్లో తప్పులు గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఓటర్లు సెప్టెంబర్ 28వ తేదీలోగా తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ)ను సంప్రదించి అవసరమైన ఆధారాలు సమర్పించి వివరాలను సరిచేసుకోవాలి.

సరైన వివరాలు అందించి ధ్రువీకరణ పూర్తి చేసుకున్న వారి పేర్లు తుది ఓటరు జాబితాలో కొనసాగుతాయి. గడువులోగా స్పందించని వారి పేర్లు తుది జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటు హక్కు కొనసాగించుకోవాలంటే ప్రతి ఓటరు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.