BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 07:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో రూ.6,700 కోట్ల ధాన్యం మళ్లింపు ఆరోపణలు.. రైస్ మిల్లర్లపై ఈడీ ఉక్కుపాదం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 07:00 PM
15 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం మళ్లింపు వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బియ్యం పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. 2021-22 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.6,700 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్ల లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్న ఈడీ అధికారులు, ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన ధాన్యం పరిమాణం, తిరిగి అప్పగించిన బియ్యం లెక్కలను పరిశీలిస్తున్నారు. ఈ రెండు వివరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన రైస్ మిల్లుతో పాటు ఆమె నివాసంలోనూ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో రూ.30 లక్షల నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్‌తో పాటు మరికొన్ని రైస్ మిల్లులపైనా విచారణ కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా, మూడు వేలకు పైగా మిల్లులకు సంబంధించిన వివరాలను సేకరించారు. పౌరసరఫరాల శాఖ రికార్డుల ఆధారంగా ధాన్యం కేటాయింపులు, బియ్యం అప్పగింతలు, నిల్వలపై లెక్కలు వేస్తున్నారు. ధాన్యం మళ్లింపు వ్యవహారంతో పాటు అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్న సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారనే అంశంపైనా ఈడీ దృష్టి సారించింది. ఆ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు పరిశీలన చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రైస్ మిల్లర్లపై దర్యాప్తు ఉత్కంఠ రేపుతోంది.