BREAKING
thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు
Test 4
Date of Publish : 25 November 2026, 09:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎన్నికల్లో కూటమి విభేదాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:19 AM
26 వీక్షణలు

పొత్తు ధర్మంపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య వివాదాలు.. పలుచోట్ల ధర్నాలు, వాయిదాలు మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవుల ఎన్నికలు కూటమి పార్టీల మధ్య విభేదాలను బయటపెట్టాయి. పదవుల కేటాయింపులో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ జనసేన, బీజేపీ నాయకులు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీల్లోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిణామాలతో పలుచోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మరికొన్ని ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ధర్మవరంలో ఎన్నిక వాయిదా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవిని కూటమి ఒప్పందంలో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున విజయలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించగా, అభ్యర్థిని మార్చాలని టీడీపీ నాయకులు పట్టుబట్టారు. ఇరు పార్టీల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో టీడీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో కోరం లేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. యలమంచిలిలో జనసేన కౌన్సిలర్ల గైర్హాజరు అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవికి టీడీపీకి చెందిన గొర్రెల శివనారాయణ పేరును కూటమి నాయకత్వం సూచించింది. జనసేనకు చెందిన కర్రి ఝాన్సీకి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జనసేనకు చెందిన 11 మంది కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. నాయుడుపేటలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు నాయుడుపేట పురపాలక సంఘం వైస్‌చైర్మన్ పదవిని తొలుత బీజేపీకి కేటాయించారు. అయితే ఐదేళ్ల పదవీకాలాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలనే ప్రతిపాదనను టీడీపీ ముందుకు తెచ్చింది. తొలుత తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టగా, టీడీపీ కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. నగరిలో పార్టీ నిర్ణయంపై నిరసన చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీకి చెందిన 36వ వార్డు కౌన్సిలర్ కె.జె. విజయభాస్కర్‌కు వైస్‌చైర్మన్ పదవి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏడో వార్డు కౌన్సిలర్ లత భర్త రమేష్ నిరసనకు దిగారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. 38 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన దళిత నాయకులకు గుర్తింపు ఇవ్వకుండా, వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం అన్యాయమని ఆరోపించారు. మార్కాపురంలో మైనారిటీల ఆందోళన మార్కాపురం మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవిని మైనారిటీలకు కేటాయించాలని ముస్లిం మైనారిటీ వర్గాలు జనసేన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. జనసేనకు చెందిన కొప్పుల జ్యోతికి ఈ పదవి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో కొనసాగిన సంప్రదాయం ప్రకారం మైనారిటీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాయి. ఆత్మకూరులో జనసేన అసంతృప్తి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించిన అభ్యర్థికి కాకుండా మరో కౌన్సిలర్‌కు అవకాశం కల్పించడంపై ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యంతోనే అభ్యర్థి మార్పు జరిగిందని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీధర్ ఆరోపించారు. వైస్‌చైర్మన్‌గా కత్తి పద్మజ ఎన్నికయ్యారు. తమకు పదవి దక్కకుండా చేశారంటూ గడ్డం సంధ్య, శిరీష మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పిఠాపురంలో జనసేన నాయకుల మధ్య విభేదాలు కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో వైస్‌చైర్మన్ అభ్యర్థి ఎంపికపై జనసేన కౌన్సిలర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బొజ్జ వెంకటేశ్వరరావు పేరును ప్రతిపాదించగా, మరో వర్గం పిండి సంధ్య పేరును ముందుకు తెచ్చింది. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జోక్యంతో చర్చలు జరిపిన అనంతరం బొజ్జ వెంకటేశ్వరరావు వైస్‌చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో ఎంపీ అనుచరుడు వీరంరెడ్డి చక్రిపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. పార్టీ నిర్ణయాలపై అసంతృప్తితో కొందరు నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సీనియర్ నాయకుడు రాయవరం శ్రీనును విడుదల చేయాలంటూ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. నందిగామలో టీడీపీ మైనారిటీ నాయకుల నిరసన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవిని 15వ వార్డు కౌన్సిలర్ ఇమామ్‌కు ఇస్తామని గతంలో హామీ ఇచ్చి, చివరి నిమిషంలో బీజేపీ కౌన్సిలర్ తొర్లికొండ సీతారామయ్యకు కేటాయించడంపై టీడీపీలోని మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ ధర్నా నిర్వహించారు. టీడీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదవుల పంపకమే వివాదాలకు కారణం మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవుల కేటాయింపులో కూటమి పార్టీల మధ్య ముందస్తు అవగాహన, స్థానిక నాయకుల అభిప్రాయాల మధ్య సమన్వయం లోపించినట్లు ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలు సూచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పదవుల పంపకం, పార్టీలకు ఇచ్చిన హామీల అమలుపై వివాదాలు తలెత్తడంతో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.