BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 04:11 pm
Posted by : PAGADALA DEVAIAH

రాజ్యాంగ హక్కులతో పాటు ఓటు హక్కును కాపాడుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
26 Nov, 2026 - 04:11 PM
11 వీక్షణలు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి

ఎల్బీనగర్, నవంబర్ 26 – ఎన్ టుడే న్యూస్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దిల్సుఖ్‌నగర్‌లో ‘మేరా షహర్ – జంతర్ మంతర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్సుఖ్‌నగర్ చౌరస్తాలో విద్యార్థులతో భారీ ప్రదర్శన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్లో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో ఏర్పడే ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.

ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌ (SIR) పేరుతో ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ప్రక్రియ, పారదర్శకత లేకుండా అర్హులైన ఓటర్ల ఓటు హక్కును తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఓటు హక్కును తొలగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘం వ్యవహారశైలికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత నిరంతరం చైతన్యంతో ఉండాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను, దేశంలో సమానత్వ విలువలను పరిరక్షించుకోవడమేనని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విద్యార్థులు, యువత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, ఎల్బీనగర్ జోన్ కార్యదర్శి వేణు, నాయకులు కార్తీక్, సుమంత్, భాను, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.