BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 05:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అనకాపల్లి వ్యక్తికి తెలంగాణలో ఏటీఎం మోసం..

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 05:17 PM
28 వీక్షణలు

సాయం చేస్తామంటూ నమ్మించి రూ.80 వేల కాజేత! ఏటీఎం వద్ద మాటల్లో పెట్టి అసలు కార్డు మార్చేసిన ఇద్దరు యువకులు.. రెండు రోజుల్లో రెండు ప్రాంతాల్లో నగదు డ్రా

అనకాపల్లి జిల్లా: ఏటీఎం వద్ద అపరిచితుల సహాయం తీసుకోవడం ఎంత ప్రమాదకరమో మరో ఘటన స్పష్టం చేసింది. నగదు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన అనకాపల్లి జిల్లాకు చెందిన మంద వెంకటయ్యను ఇద్దరు యువకులు మాటల్లో పెట్టి మోసగించారు. సాయం చేస్తామంటూ నమ్మించి ఆయన ఏటీఎం కార్డును చాకచక్యంగా మార్చేసి ఖాతాలోని రూ.80 వేల నగదును కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న మంద వెంకటయ్య నగదు డ్రా చేసేందుకు తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లారు. అక్కడ నగదు రాకపోవడంతో సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు యువకులు నగదు డ్రా చేసేందుకు సహాయం చేస్తామంటూ ఆయనను నమ్మించారు. వెంకటయ్య నుంచి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ నమోదు చేయించారు. నగదు రావడం లేదంటూ మాటల్లో పెట్టి ఆయన దృష్టిని మళ్లించారు. ఈ క్రమంలో అసలు ఏటీఎం కార్డును తమ వద్ద ఉన్న మరో కార్డుతో మార్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన కార్డు మారిపోయిన విషయాన్ని గుర్తించలేని వెంకటయ్య యథావిధిగా ఇంటికి వెళ్లిపోయారు. మోసగాళ్లు మాత్రం తమ చేతికి చిక్కిన అసలు కార్డుతో నగదు డ్రా చేశారు. నవంబర్ 16న వనపర్తిలో రూ.40 వేలు, నవంబర్ 17న హైదరాబాద్‌లో మరో రూ.40 వేలు డ్రా చేశారు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే వెంకటయ్య బ్యాంకు ఖాతా నుంచి మొత్తం రూ.80 వేలు మాయమయ్యాయి. పంట రుణం రెన్యూవల్ చేయించుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన వెంకటయ్యకు ఖాతాలో నగదు తగ్గినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా నగదు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు. తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా అది తనది కాదని తెలుసుకున్నారు. దీంతో జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం వినియోగదారులకు హెచ్చరిక ఏటీఎం కేంద్రాల్లో అపరిచితుల సహాయం తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏటీఎం కార్డును ఇతరుల చేతికి ఇవ్వకూడదని, పిన్ నంబర్‌ను ఎవరికీ తెలియజేయకూడదని, నగదు రాకపోయినా లేదా లావాదేవీ విఫలమైనా వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టానికి దారితీస్తుందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.