BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 26 June 2026, 10:50 am
Posted by : JP.NAGIREDDY

పీలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 10:50 AM
101 వీక్షణలు

పీలేరు | అన్నమయ్య జిల్లా | N Today News

అన్నమయ్య జిల్లా పీలేరు మండలం టానా వడ్డిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, పీర్ల పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బీ, ఆమె మనవడు వాహిద్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదంలో గాయపడిన మరో ఏడుగురిని అత్యవసర వైద్య సేవల కోసం 108 అంబులెన్స్ ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ఈ విషాద ఘటనతో మృతుల స్వగ్రామమైన రేగళ్లలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.