BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 09:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణకు కేంద్ర కేబినెట్‌లో రెండు బెర్తులా!? ఈటల, డీకే అరుణ పేర్లు ప్రచారంలో

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 09:38 PM
140 వీక్షణలు

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహంతో బీజేపీ అధిష్ఠానం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఒక బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గ నేతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఈటల రాజేందర్‌కు రాష్ట్ర రాజకీయాల్లో, మాజీ మంత్రిగా ఉన్న అనుభవం, బీసీ వర్గాల్లో ఉన్న ప్రభావం కలిసి వస్తాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే డీకే అరుణకు కేంద్రంలో అవకాశం కల్పించడం ద్వారా రెడ్డి సామాజికవర్గంలో పార్టీ బలాన్ని పెంచాలనే వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.

అయితే, కేంద్ర కేబినెట్ విస్తరణపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈటల రాజేందర్, డీకే అరుణకు మంత్రి పదవులు ఖరారైనట్లు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే.