BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 10:05 am
Posted by : K MAHESH

ట్రాఫిక్ నిబంధనలపై ఆదర్శ పాఠశాల విద్యార్థుల అవగాహన ర్యాలీ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 10:05 AM
12 వీక్షణలు

నెల్లికుదురు, నవంబర్ 26:

మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులతో బుధవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

రవాణా వ్యవస్థ పాఠ్యాంశంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, రోడ్డు భద్రతా నియమాలను అనుసరించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.

పాఠ్యాంశాలను ర్యాలీలు, క్షేత్ర పర్యటనల ద్వారా ప్రత్యక్ష అనుభవంతో నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో సామాజిక బాధ్యతతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానం పెంపొందుతుందని ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానాను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. ఉపేందర్ రావు అభినందించారు.