పోషకాహారంపై అవగాహన ర్యాలీ
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
మునగపాక: ప్రతి మహిళా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అన్నపూర్ణ సూచించారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా సోమవారం మునగపాక పల్లపు వీధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తాజా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, ఉజ్వల భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు.
పోషకాహారం, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రేవతీపద్మ, హేమలత, పలువురు మహిళలు పాల్గొన్నారు.