BREAKING
thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
Date of Publish : 07 October 2026, 01:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో చట్టాలపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 01:49 PM
7 వీక్షణలు

చింతలపూడి: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా సాధికార సంస్థల ఆదేశాల మేరకు చింతలపూడి శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నూతన చట్టాలు, పేదలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చింతలపూడి సివిల్ జడ్జి ఏ.బి. అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. దేశంలో అమలులోకి వచ్చిన నూతన చట్టాలు, సామాన్య ప్రజలు, పేదలు న్యాయ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చనే అంశాలను వివరించారు.

ప్రతి ఒక్కరికీ చట్టాలపై ప్రాథమిక అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని సివిల్ జడ్జి పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంతోపాటు, తమ హక్కులను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి న్యాయ సేవా సంస్థల ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోలీసు, న్యాయ శాఖలు సంయుక్తంగా యువతకు చట్టాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను చింతలపూడి ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై కె. సతీష్ కుమార్ పర్యవేక్షించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.