BREAKING
thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం
Date of Publish : 24 June 2026, 07:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బాలకృష్ణకు మంత్రి పదవి..?

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jun, 2026 - 07:28 PM
151 వీక్షణలు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి దక్కనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2014 నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలకృష్ణ తన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఇటీవల సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి సారించనున్నారని, భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ప్రజా సేవకే సమయం కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తుండటంతో బాలకృష్ణకు మంత్రి పదవి లభించే అవకాశాలపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.

అలాగే రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు హిందూపురంలోనే ఎక్కువ సమయం గడపాలని, అందుకోసం అక్కడ సొంత ఇల్లు నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే మంత్రి పదవిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం జరుగుతున్నవి కేవలం రాజకీయ వర్గాల ప్రచారమే.