BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 14 August 2026, 05:59 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిలకలూరిపేట బైపాస్‌పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 05:59 AM
69 వీక్షణలు

చిలకలూరిపేట బైపాస్‌పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా

చిలకలూరిపేట: చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డులోని లింగాయపాలెం సమీపంలో ఇంధనంతో వెళ్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్‌లో భారీగా ఇంధనం ఉండటంతో ప్రమాద తీవ్రతపై స్థానికులు, వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఏ చిన్న నిప్పురవ్వ తగిలినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను నియంత్రించి, ప్రమాదం మరింత విస్తరించకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ట్యాంకర్‌ నుంచి ఇంధనం లీకవుతుందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తూ అప్రమత్తంగా వ్యవహరించారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా పడినప్పటికీ పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.