నల్గొండ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బైరెడ్డి హేమలత వెంకట్‌రెడ్డి
18 మందితో నూతన పాలకవర్గం ఏర్పాటు.. సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు
నల్గొండ: నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్‌పర్సన్‌గా బైరెడ్డి హేమలత వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా వడ్డేపల్లి శ్రీరాములు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులను ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవిని ఓసీ మహిళల కేటగిరీకి కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. నూతన పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన పాలకవర్గ సభ్యుల వివరాలు:
1. చైర్‌పర్సన్: బైరెడ్డి హేమలత వెంకట్‌రెడ్డి
2. వైస్ చైర్మన్: వడ్డేపల్లి శ్రీరాములు
3. తిరుమల రాము
4. కత్తుల కృష్ణయ్య
5. పిన్నపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
6. మర్రి నరసింహ
7. వడ్డె దామోదర్‌రెడ్డి
8. షేక్ సయ్యద్
9. గౌని నరేష్
10. నల్గొండ రాణి లింగస్వామి
11. పల్లెబోయిన లింగయ్య
12. దేవిరెడ్డి లక్ష్మారెడ్డి
13. చిట్టిపోలు నాగయ్య
14. గుండె రమేష్‌బాబు
15. తిప్పర్తి పీఏసీఎస్ చైర్మన్
16. జిల్లా మార్కెటింగ్ అధికారి, నల్గొండ
17. సహాయ వ్యవసాయ సంచాలకులు, నల్గొండ
18. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతన పాలకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాలను నిర్వహించనుంది.