BREAKING
thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Vijayawada : విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:05 PM
11 వీక్షణలు

ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు నిబంధనలు పాటించాలి: విజయవాడ పోలీస్ కమిషనర్

విజయవాడ, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసుల ఆదేశాలను పాటించాలని సూచించారు.

డప్పులు, డీజేలు, బాణసంచాపై నిషేధం

సోమవారం ఆయన మాట్లాడుతూ.. విజయోత్సవాల పేరుతో డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహించడం, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో కూడిన మైక్ సెట్లు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధమని తెలిపారు.

నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163, పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ఇతర వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా సంబంధిత వ్యక్తులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

శాంతిభద్రతలకు సహకరించాలి

ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు. నగరంలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, పరస్పర శాంతి సామరస్యాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.