పరిమిత నిధులతో గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్
తెలంగాణలోనూ జనసేనకు అవకాశం ఇస్తే అభివృద్ధికి కొత్త దిశ చూపిస్తారు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పరిమిత నిధులతోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న శ్రీ పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నాం. పక్క రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిని ఆచరణలో చూపిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించిన తరహాలో, తెలంగాణ ప్రజలు కూడా జనసేన పార్టీకి అవకాశం కల్పిస్తే రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారనే విశ్వాసం ఉందని జనసేన నాయకులు పేర్కొన్నారు.
నీతి, నిజాయితీకి గుర్తింపు
శ్రీ పవన్ కళ్యాణ్‌కు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయని వారు పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, దూరదృష్టి, జవాబుదారీతనం కలిగిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ అభివృద్ధిపై ఆశాభావం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేయగల నాయకత్వం పవన్ కళ్యాణ్‌కు ఉందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో జనసేనకు అవకాశం లభిస్తే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.