BREAKING
thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మురస తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలకు ఆర్డీవో ఏ. కుమార్ సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:11 PM
9 వీక్షణలు

అర్ధరాత్రి నుంచి తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు రెస్క్యూ బృందాలు సిద్ధం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన మురస తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించినట్లు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ తెలిపారు. నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, రహదారులపై చెట్లు కూలిపోవడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డీవో సూచించారు. విద్యుత్ శాఖ సిబ్బంది దెబ్బతిన్న స్తంభాలు, తెగిపడిన తీగలను వెంటనే సరిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర వైద్య సేవలకు అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సామగ్రిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖలు రహదారులపై కూలిన చెట్లను తొలగించేందుకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులు, కాలువలు, నీటి వనరుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, పోలీసు శాఖ ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా ఉంచి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలు రెస్క్యూ బృందాలు, వాహనాలు, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. తిరువూరు, ఏ. కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి తుఫాన్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు మురుగునీటి కాలువలను పరిశీలించి నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ రైతులకు పంటల రక్షణపై సూచనలు అందించాలని తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకునేలా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన పశువైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తుఫాన్ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆర్డీవో కోరారు. పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు, బలహీనమైన గోడలు, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ముప్పు ఉంటే అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించకూడదన్నారు. ఇంట్లో తాగునీరు, ఆహార పదార్థాలు, అవసరమైన మందులు, టార్చ్‌లైట్, మొబైల్ ఛార్జింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రైతులు పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పశువులను చెట్ల కింద కాకుండా సురక్షితమైన షెడ్లలో ఉంచాలని తెలిపారు. అధికారిక వాతావరణ హెచ్చరికలు, ప్రభుత్వ సూచనలను మాత్రమే విశ్వసించాలని, ధృవీకరించని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని ఆర్డీవో సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా సహాయం పొందాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆర్డీవో ఏ. కుమార్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.