తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు
గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో భారీ బతుకమ్మతో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం రంగురంగుల పూలతో కళకళలాడింది. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో అందంగా చిన్నారులు అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగల నిర్వహణ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, పండుగల ద్వారా ఐక్యత, స్నేహభావం, ప్రకృతి పరిరక్షణ వంటి విలువలను అలవర్చుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలు పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు..