BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 04:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిరలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Oct, 2026 - 04:11 PM
8 వీక్షణలు

మధిర: ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థులు పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ, ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ సభ్యులు డా. ఎస్. ఇందిర, డా. పి. సుజాత, అధ్యాపకులు పి. లక్ష్మీనారాయణ, డా. వి. నాగరాజు, డా. ఎం.వి.ఎస్. శర్మ, పి. శ్రీనివాస్, షేక్ ఇమ్రాన్, ఎస్. జ్యోతి, టీ. ఆదర్శ్, ఎస్. పృథ్వీరాజ్, పి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.