BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 05:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ద్వారకాతిరుమలలో చిన్నారులతో భిక్షాటన.. అధికారుల తక్షణ స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 05:49 PM
32 వీక్షణలు

బాల్యాన్ని, చదువును దూరం చేయొద్దు.. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి: జెడ్పీ చైర్‌పర్సన్ చింతమనేని సాయి నవ్యశ్రీ**

ఏలూరు జిల్లా: చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న ఘటనపై ఏలూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చింతమనేని సాయి నవ్యశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పిల్లల బాల్యం అమూల్యమైనదని, భిక్షాటన పేరుతో వారి చదువును, భవిష్యత్తును దెబ్బతీయకూడదని జెడ్పీ చైర్‌పర్సన్ పేర్కొన్నారు. చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన చింతమనేని సాయి నవ్యశ్రీ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆలయ పరిసరాల్లో గాంధీ వేషధారణలో ఒంటికి రంగులు పూసుకుని భిక్షాటన చేస్తున్న ముగ్గురు చిన్నారులను గమనించారు. వారితో పాటు ఉన్న మహిళ చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న విషయాన్ని గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించాలని సూచించారు.

దీంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు రంగంలోకి దిగి చిన్నారులను, వారితో ఉన్న మహిళను గుర్తించి విచారణ చేపట్టారు. విచారణలో ఆ మహిళ నల్లజర్ల గ్రామంలోని కొత్త కాలనీకి చెందినదని, తన ముగ్గురు పిల్లలకు గాంధీ వేషధారణ వేయించి ప్రతి శని, ఆదివారాల్లో ద్వారకాతిరుమలకు తీసుకువచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు వెల్లడైంది. ఆ ముగ్గురు చిన్నారులు నల్లజర్ల మండలంలోని ఓ పాఠశాలలో చదువుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించారు.

అనంతరం ద్వారకాతిరుమల జీఎంఎస్‌కే, అంగన్వాడీ కార్యకర్త సహకారంతో చిన్నారులను ఏలూరులోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కార్యాలయానికి తరలించారు. అక్కడ వారికి స్నానం చేయించి, ఒంటిపై ఉన్న రంగులను తొలగించి శుభ్రం చేశారు. డీసీపీఓ సూర్య చక్రవేణి చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి బాల్యం ప్రాముఖ్యత, విద్య అవసరం, భవిష్యత్తులో చదువు ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.

చిన్నారులతో భిక్షాటన చేయించడం చట్టరీత్యా నేరమని అధికారులు తల్లిదండ్రులకు స్పష్టం చేశారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని సూచించారు. ఈ విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జీఎంఎస్‌కేలతో మాట్లాడి చిన్నారుల పాఠశాల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోసారి పిల్లలతో భిక్షాటన చేయించినట్లు గుర్తిస్తే చిన్నారులను సంరక్షణ కేంద్రానికి తరలించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిన్నారుల హక్కులు, విద్య, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్య చక్రవేణి, సిబ్బంది రాజేష్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది రాజ్యలక్ష్మి, మోహన్, రజిత, ద్వారకాతిరుమల జీఎంఎస్‌కే కమలకుమారి, అంగన్వాడీ కార్యకర్త అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.