BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భీమడోలులో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పోలీసుల ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 02:47 PM
21 వీక్షణలు

ఎన్నికల విధుల్లో సేవలకు ప్రశంసా పత్రాలు అందజేత ఏలూరు జిల్లా: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో పోలీసు శాఖకు అండగా నిలిచి, విశిష్ట సేవలందించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను భీమడోలు పోలీసులు అభినందించారు. ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల భీమడోలుకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేసి వారి సేవలను గుర్తించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. భీమడోలు సర్కిల్ సీఐ కృష్ణ, ఎస్ఐ మదీనా బాషా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించడం, పోలీసు సిబ్బందికి సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములవడం వంటి సేవలను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు విద్యార్థులు అందించిన సహకారం అభినందనీయమని సీఐ కృష్ణ పేర్కొన్నారు. యువత చదువుతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి ప్రజాసేవలో భాగస్వాములు కావడం ఆదర్శనీయమని ఎస్ఐ మదీనా బాషా కొనియాడారు. సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించాలని, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేపట్టే కార్యక్రమాలకు విద్యార్థులు సహకరించాలని అధికారులు సూచించారు. ఎన్నికల విధుల్లో సేవలందించిన వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించడం ద్వారా వారి సేవలను గుర్తించడమే కాకుండా, భవిష్యత్తులో మరింత మంది యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహం కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, పోలీసు సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.