తిరువూరులో భగత్ సింగ్ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడని కొనియాడారు. చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన దేశం పట్ల చూపిన నిబద్ధత, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్, నాయకులు పి. శ్రీనివాసరావు, ఎ. రవి, బి. వెంకటేశ్వరరావు, ఎం. చింతయ్య, షేక్ నాగులు మీరా, కె. రవి తదితరులు పాల్గొన్నారు.