BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 07:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భర్తను నెలవారీ లీజుకు ఇచ్చిన భార్య.. అక్రమ సంబంధానికి వినూత్న బదులు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 07:02 AM
131 వీక్షణలు

భర్తను నెలవారీ లీజుకు ఇచ్చిన భార్య.. అక్రమ సంబంధానికి వినూత్న బదులు

బ్యాంకాక్: ఇల్లు, కారు, బైక్‌లను అద్దెకు ఇవ్వడం సాధారణమే. కానీ భర్తను నెలవారీ లీజుకు ఇస్తానంటూ భార్య చేసిన ప్రతిపాదన ప్రస్తుతం థాయిలాండ్‌లో సంచలనంగా మారింది. భర్త అక్రమ సంబంధం విషయం బయటపడిన తర్వాత కోపంతో కాకుండా వినూత్నంగా స్పందించిన ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

థాయిలాండ్‌కు చెందిన 31 ఏళ్ల ఖున్ క్వాంగ్ పదేళ్ల క్రితం ఓ పోలీసు అధికారిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల భర్త ప్రవర్తనలో మార్పు రావడం, తరచూ ఆలస్యంగా ఇంటికి రావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించగా, భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి వేరే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు ఆధారాలతో బయటపడింది.

ఈ విషయం బయటపడిన తర్వాత భర్త ఇంటికి వచ్చి తనకు ఈ కుటుంబ జీవితం వద్దని, ఇల్లు, కారు, అప్పులు అన్నీ భార్యకే వదిలేస్తానని చెప్పి ప్రియురాలితో ఉండేందుకు వెళ్లిపోయాడు. అనంతరం భార్య అతడిని మళ్లీ ఇంటికి రప్పించింది.

ఒక రోజు తన ప్రియురాలిని మర్చిపోలేనని భర్త చెప్పడంతో, క్వాంగ్ వినూత్న ప్రతిపాదన చేసింది. "నీకు నా భర్త కావాలి.. అతడికి నువ్వు కావాలి. కాబట్టి నెలకు 30,000 థాయ్ బాట్లు (సుమారు రూ.85 వేల) నాకు చెల్లిస్తే నా భర్తను నీతోనే ఉంచుకో. అయితే నేను చట్టపరంగా విడాకులు మాత్రం ఇవ్వను" అని షరతు పెట్టింది.

ఈ ప్రతిపాదనకు ప్రియురాలు అంగీకారం తెలిపినప్పటికీ, తనను ఇలా "లీజుకు" ఇవ్వడాన్ని భర్త తిరస్కరించాడు. దీంతో ఆ ఒప్పందం అమలులోకి రాలేదు.

ఈ ఘటన వైరల్ కావడంతో న్యాయ నిపుణులు స్పందించారు. థాయిలాండ్ చట్టాల ప్రకారం వివాహ బంధంలో ఉన్న వ్యక్తిని డబ్బులు తీసుకుని మరొకరికి "లీజుకు" ఇచ్చే ఒప్పందాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. చివరకు తన లీజ్ ప్రతిపాదన ఫలించకపోవడంతో క్వాంగ్ భర్త ప్రియురాలిపై కోర్టులో కేసు నమోదు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.