తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాష్యం ప్రవీణ్
భక్తి
భక్తి
తిరుమల: పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం బంధుమిత్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికినట్లు సమాచారం. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఆర్టీవీ ప్రసాద్, వీరేంద్ర చౌదరి, భాష్యం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.