BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 09:36 PM
9 వీక్షణలు

విజయవాడ: ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. సొసైటీ సభ్యుల పిల్లల్లో ఇటీవల జరిగిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 95 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

విజయవాడ నిర్మల కాన్వెంట్ రోడ్‌లోని సొసైటీ బ్రాంచ్‌లో జరిగిన ఈ అభినందన కార్యక్రమానికి సొసైటీ డైరెక్టర్ ఎం.బి. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఆరు రాష్ట్రాల్లోని 46 బ్రాంచ్‌ల పరిధిలో మొత్తం 292 మంది విద్యార్థులు ఈ ప్రోత్సాహక కార్యక్రమానికి ఎంపిక కాగా, విజయవాడలోని సత్యనారాయణపురం, భవానీపురం, ఆటోనగర్, నిర్మల కాన్వెంట్ రోడ్ బ్రాంచ్‌ల పరిధి నుంచి 14 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.