BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 01:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి సర్పంచ్ బరిలో గడ్డం ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కూటమి శ్రేణుల మద్దతుతో ఎన్నికల బరిలోకి..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 01:43 PM
147 వీక్షణలు

చాట్రాయి  గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు
నామినేషన్ కార్యక్రమానికి హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన చాట్రాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొనగా, ఉమ్మడి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గడ్డం ప్రభాకర్ రెడ్డి శనివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో చాట్రాయి గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గడ్డం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చాట్రాయి గ్రామ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పదవి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, గ్రామంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేయడం, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రతి వీధిలో వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, రైతులు, యువత, మహిళలు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని చెప్పారు. గ్రామ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే చాట్రాయి గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో పనిచేస్తానని కోరారు. మరోవైపు ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో స్థానికంగా ఎన్నికల చర్చ ఊపందుకుంది. టీడీపీ, జనసేన నాయకులు కలిసి పాల్గొనడం కార్యక్రమంలో ప్రత్యేకత సంతరించుకుంది. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు మందపాటి బసవా రెడ్డి, మాజీ సర్పంచ్ కోట జోజి, టీడీపీ నాయకులు గడ్డం నాగిరెడ్డి, తోటకూర వెంకటేశ్వర రావు, కుప్పిరెడ్డి కొండా రెడ్డి, మద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కమ్ముల కొండల రావు, అంబటి చంటి జనసేన నాయకులు సవరం రామారావు, తుమ్మల రాంబాబు, తుమ్మల కరుణాకర్, బీజేపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ రావు, ఆదిమూలం నాగమోహన శర్మ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.