BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 25 March 2026, 09:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:21 PM
172 వీక్షణలు

చింతలపూడికి పాకిన పెట్రోల్ కొరత

చింతలపూడి పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో, అందుబాటులో ఉన్న కొద్దిమంది బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఉదయం నుంచే కిలోమీటర్ల మేర క్యూలలో నిల్చున్న వాహనాలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు దారితీస్తున్నాయి.

ఇప్పటికే ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–ఇశ్రాయేల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రస్తావించిన నేపథ్యంలో, చింతలపూడిలో కనిపిస్తున్న పరిస్థితులు ప్రజల్లో మరింత కలవరాన్ని రేపుతున్నాయి.

ఇంధన కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని అవసరమైన మేరకు ఇంధనం నింపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి సరఫరా వ్యవస్థను త్వరితగతిన పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.