BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 June 2026, 04:46 pm
Posted by : V శ్రీనివాస్

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 04:46 PM
220 వీక్షణలు

ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

  • మైనార్టీ విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ
  • జూన్ 1 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం (ఫాల్ సెషన్–2026) కింద అర్హులైన మైనార్టీ విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి (ఇన్‌చార్జ్) నీరటి రాజేశ్వరి తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్ తదితర దేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో పీజీ లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు జూన్ 1 నుంచి జూన్ 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదని, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన హార్డ్ కాపీలను జూలై 31, 2026 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అర్హులైన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అధికారులు పేర్కొన్నారు