BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 June 2026, 07:26 pm
Posted by : కూనురు మధు

ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం..

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Jun, 2026 - 07:26 PM
296 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. ఒకటో వార్డు తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం! ​వార్త ప్రసారమైన కొన్ని గంటల్లోనే స్పందన 

  • ఒకటో వార్డు తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం!

  • * ​వార్త ప్రసారమైన కొన్ని గంటల్లోనే స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత

  • * ​యుద్ధప్రాతిపదికన కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మార్పిడి


​ప్రజా సమస్యలపై 'ఎన్ టుడే న్యూస్ '  డిజిటల్/న్యూస్ ఛానల్ అందించిన క్షేత్రస్థాయి కథనానికి మున్సిపల్ యంత్రాంగం తక్షణమే స్పందించింది. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు (శివనేనిగూడెం) లో తాగునీటి కోసం స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై,  సోమవారం ఉదయం ఎన్ టుడే లో  'చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు' అంటూ వచ్చిన ఈ వార్త స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించారు ​ఈ వార్తపై చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతా అత్యంత వేగంగా స్పందించారు. ఒకటో వార్డులో తాగునీటి సరఫరా నిలిచిపోవడానికి ప్రధాన కారణం మోటార్‌కు విద్యుత్ అందించే ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడమేనని గుర్తించిన ఆమె, వెంటనే విద్యుత్ శాఖ అధికారులను రంగంలోకి దించారు. వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే యుద్ధప్రాతిపదికన కాలిపోయిన పాత ట్రాన్స్ఫార్మర్‌ను తొలగించి, దాని స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్‌ను ఏర్పాటు చేయించారు. దీంతో శివనేనిగూడెం పరిధిలోని ఒకటో వార్డు ప్రజల తాగునీటి , సాగు నీటి కష్టాలు  తీరుతాయని, అన్నారు. 

* ​'ఎన్ టుడే న్యూస్' కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు

​తమ వార్డులో నెలకొన్న తీవ్రమైన మంచినీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కొన్ని గంటల వ్యవధిలోనే పరిష్కారం లభించేలా చేసినందుకు 1వ వార్డు ప్రజలు, స్థానికులు 'ఎన్ టుడే న్యూస్ ' యాజమాన్యానికి, ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వార్త వచ్చిన వెంటనే సానుకూలంగా స్పందించి సమస్యను తీర్చిన మున్సిపల్ చైర్పర్సన్‌కు పందిరి గీతకు ధన్యవాదాలు తెలియజేశారు.