BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 01 June 2026, 04:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 04:39 PM
153 వీక్షణలు

చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే, తదుపరి నెల నుంచే స్పౌజ్ పెన్షన్ కింద భార్యకు పెన్షన్ అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని చెప్పారు.

అలాగే రాష్ట్రంలోని అర్హులైన వితంతువులందరికీ ఈ నెల 12వ తేదీన కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దె అంజి, బుస్సు తిరుపతయ్య, ఎడ్ల రాములు, బాల్ధ భూషణం, కంచు బాబు, సంగుంది సత్యనారాయణ, వీఆర్‌వో శోభన్‌బాబు, వీఏఏ నాగమణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.