BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 01 June 2026, 07:17 pm
Posted by : V శ్రీనివాస్

​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 07:17 PM
229 వీక్షణలు

​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి

  • రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగాలి
  • ​రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

​మంచిర్యాల జిల్లా :జూన్ 1, 2026: రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి, నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలిస్తున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. రైస్ మిల్లుల నిర్వాహకులు సి.ఎం.ఆర్. లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండల పరిధిలోని ఎస్ ఆర్ ఎం రైస్ మిల్లును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములుతో కలిసి, అలాగే గాయత్రి రైస్ మిల్లును మండల తహసిల్దార్ పుష్పలతతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లులకు కేటాయించిన ధాన్యం సి ఎం ఆర్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

​అనంతరం కలెక్టర్ తన పర్యటనలో భాగంగా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని శ్రీరామ రైస్ మిల్లును సందర్శించి, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్‌తో కలిసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా ధాన్యం ప్రక్రియ సాగాలని, ఎక్కడా కాలయాపన జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మిల్లుల నిర్వాహకులు కూడా ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి లక్ష్యాలను త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు.

​ఆ తర్వాత దండేపల్లి మండలంలోని జై యోగేశ్వర రైస్ మిల్లుతో పాటు దండేపల్లి, కొర్విచెల్మ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం నిల్వ, తరలింపులో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు