BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 01:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో కూటమి ఎన్నికల ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 01:38 PM
29 వీక్షణలు

**చైర్మన్ అభ్యర్థి కంభం ఎస్తేరు రాణి, వార్డు అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం.. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రత్యేక ప్రార్థనలు**

**చింతలపూడి:** నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చింతలపూడిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నెల 26న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రచార రంగంలోకి దిగారు. ఆంథోనీ నగర్‌లో నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి కంభం ఎస్తేరు రాణి, 13వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కంభం రమేష్, 14వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సింగంశెట్టి దివ్యభారతితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి వీధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. చైర్మన్ అభ్యర్థితో పాటు వార్డు అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కొలుకులూరి రాయప్ప, సిస్టర్స్ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు ఘనంగా సన్మానం చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని, పట్టణ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

మరోవైపు 13, 14వ వార్డుల్లో ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేసి ప్రతి ఓటరును కలిసే దిశగా నాయకులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. చైర్మన్ అభ్యర్థి కంభం ఎస్తేరు రాణితో పాటు వార్డు అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాటి అప్పారావు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చిదరాల మధుబాబు, బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి విజయకుమారి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చిట్లూరి ధర్మరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.