BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 July 2026, 06:18 am
Posted by : V శ్రీనివాస్

​చిన్న వయసులోనే అంతర్జాతీయ పర్వతారోహకుడుగా రాణిస్తున్న ‘జాటోత్ విహాన్ రామ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 06:18 AM
119 వీక్షణలు

రూ. 50 వేల ఆర్థిక సాయం అందించి, అభినందించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్‌కు చెందిన 9 సంవత్సరాల చిన్నారి, మాస్టర్ జాటోత్ విహాన్ రామ్ అంతర్జాతీయ పర్వతారోహణ రంగంలో అద్భుత రికార్డులతో దూసుకుపోతున్నాడు. చిన్న వయసులోనే పర్వతారోహణలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో మంచిర్యాల పేరును నిలబెట్టిన విహాన్ రామ్‌ను మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ప్రత్యేకంగా అభినందించారు.

​ఇప్పటికే విహాన్ రామ్ హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ పతాల్సు (4,250 మీటర్లు), ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన మౌంట్ కిలిమంజారో (5,685 మీటర్లు), మరియు ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసియుస్కో (2,228 మీటర్లు) పర్వతాలను అధిరోహించి సరికొత్త రికార్డులను సృష్టించాడు.

​ఈ చిన్నారి సాధించిన అసాధారణ విజయాలను తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు విహాన్ భవిష్యత్ పర్వతారోహణ లక్ష్యాలకు, అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘మౌంట్ ఎవరెస్ట్’ శిక్షణ కోసం తన వంతు ప్రోత్సాహంగా రూ. 50,000/- (యాభై వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 9 ఏళ్ల వయసులోనే విహాన్ రామ్ అంతర్జాతీయ స్థాయిలో పర్వతాలను అధిరోహించడం నియోజకవర్గానికే కాకుండా దేశానికే గర్వకారణమన్నారు. విహాన్ రామ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మౌంట్ ఎవరెస్ట్ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతిభ గల యువతకు, క్రీడాకారులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు