BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 May 2026, 02:22 pm
Posted by : కూనురు మధు

చిట్యాల లో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 May, 2026 - 02:22 PM
1,004 వీక్షణలు

చిట్యాల లో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం  ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.

​వివరాల్లోకి వెళ్తే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు, లక్ష్మీ గార్డెన్స్ సమీపంలో నివాసముంటున్న పాకల అంజయ్య ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

​ఇల్లు తగలబడుతుండటం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై రామన్నపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో పక్కన ఉన్న ఇళ్లకు ప్రమాదం తప్పడమే కాకుండా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగారు.