BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 12:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ భక్తుల పాండవుల గట్టు యాత్ర

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 12:28 PM
339 వీక్షణలు

చనుబండ భక్తుల పాండవుల గట్టు యాత్ర

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ పంచాయతీ నుంచి భక్తులు పాండవుల గట్టుకు బయలుదేరారు. గత 100 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ యాత్ర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోతామనే ఆందోళనలో ఉన్న చనుబండ బీసీ కాలనీ రైతులు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి కొండపర్వ గ్రామంలోని పాండవుల గట్టుకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఇంటి వద్దకు భక్తులు చేరుకోగా, వారితో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి తప్పకుండా వర్షాలు కురుస్తాయని, రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

తీవ్ర ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. రైతులందరూ పంటల బీమా చేయించుకుని నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రైతులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.