BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 07 October 2026, 06:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సర్వీస్ రూల్స్‌లో మార్పులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:46 AM
20 వీక్షణలు

డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు సంబంధించి ప్రభుత్వం సర్వీస్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ పోస్టును కేటగిరీ–4లో చేర్చారు. ఈ కేటగిరీలో స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ (రిసర్వే) పోస్టులు కూడా ఉంటాయి.

డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు రెండు మార్గాల్లో నియామకాలు చేపట్టనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వారికి ప్రమోషన్ ద్వారా నియామకం కల్పించే విధానం కొనసాగుతుంది.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. నోటిఫికేషన్ వెలువడే సంవత్సరం జూలై 1 నాటికి అభ్యర్థి వయసు 34 సంవత్సరాలు పూర్తి అయి ఉండకూడదు.

సీనియర్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకానికి కనీసం నాలుగేళ్ల సర్వీస్ అవసరం. ఇందులో రెండేళ్ల సర్వీస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా ఉండాలి. అలాగే స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన ఆరు నెలల సర్వీస్‌ను రెండేళ్ల సర్వీస్‌గా పరిగణించే వెసులుబాటును కూడా నిబంధనల్లో కల్పించారు.