Chatrai: చాట్రాయిలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి సవరం రామలక్ష్మికి మద్దతుగా కూటమి నేతల ప్రచారం
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలో కూటమి జనసేన ఎంపీటీసీ అభ్యర్థి సవరం రామలక్ష్మి విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల గుర్తు గ్లాసుపై ఓటు వేసి రామలక్ష్మిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీకర బుర్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మందపాటి బసవరెడ్డి, జనసేన నాయకులు తుమ్మల జగన్, సవరం రామారావుతో పాటు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. గ్లాసు గుర్తుకు ఓటు వేసి సవరం రామలక్ష్మిని ఎంపీటీసీగా గెలిపించాలని ప్రజలను కోరారు. కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.