జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్ సంపూర్ణ సంఘీభావం
వరంగల్, నర్సంపేట, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని అఖిల భారత మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం కొనసాగుతున్న సమ్మె 19వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ పటేల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ పథకం కింద సుమారు 17,541 మంది ఉద్యోగులు గత 26 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. హెల్త్ ఆఫీసర్ స్థాయి నుంచి స్వీపర్ స్థాయి వరకు సుమారు 78 రకాల ఉద్యోగాల్లో పనిచేస్తున్నప్పటికీ, వారికి నామమాత్రపు వేతనాలే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు కనీసం ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకపోవడం విచారకరమన్నారు. ఇన్నేళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి ఇతర న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు.
సమ్మెకు పలువురు సంఘీభావం
ఈ కార్యక్రమంలో బీసీ బహుజన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మేడిగ సతీష్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నాయకుడు ఐతం నగేష్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ టీ. భరత్ కుమార్, ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర ఆర్గనైజర్ డాక్టర్ గుండా రవీందర్, ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలబోజు మోహన్‌రావు, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ యశస్విని పాల్గొన్నారు.
అలాగే నర్సంపేట పల్లె దవాఖాన వైద్యుడు డాక్టర్ శ్రవణ్ కుమార్, నర్సంపేట టీ-హబ్ ఫార్మసిస్ట్ బిర్రు స్వప్న, డాక్టర్ అనిత, డాక్టర్ నిఖిల్, డాక్టర్ హారిక, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అర్చన, ఈవిన్ మేనేజర్ రవీందర్, డైకు మేనేజర్ మేర్గు అనిల్ కుమార్ పాల్గొన్నారు.
నర్సింగ్ ఆఫీసర్లు స్వప్న, కళ్యాణి, సుమలత, సుష్మ, ఫార్మసీ ఆఫీసర్ నూకల అంజి యాదవ్, జోష్ణ, సంతోష్, శివకుమార్, తీగల సతీష్ కుమార్, అకౌంటెంట్ శ్రీనివాస్ బాబు, మౌనిక, పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెల్, వైకుంఠం, సుజాత, టీబీ విభాగానికి చెందిన రంజిత్, రాకేష్ పాల్గొన్నారు.
ఏఎన్‌ఎంలు దాసరి నర్మద, సంధ్య, జ్యోతి, సుల్తానా, పేనీన, రాజేశ్వరి, ప్రభావతి, అనిత, శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్ జూకంటి మౌనిక, ఎంఎన్‌ఓ ఏకుల చిరంజీవి, బండి రాజేష్, కుమార్, సపోర్టింగ్ సిబ్బంది గూడెపు ప్రభాకర్, రజియాతో పాటు పలువురు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు.