BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 08:45 pm
Posted by : KOLA MAHESH

ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
31 Oct, 2026 - 08:45 PM
16 వీక్షణలు
  • ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేక ప్రతిభ ఉంటుంది: ఎంఈఓ లక్ష్మణరావు
  • మండల స్థాయి క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

మహబూబాబాద్‌ జిల్లా, బయ్యారం, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌):

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి జి. లక్ష్మణరావు అన్నారు. బయ్యారం మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు.

మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి వారిని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి తగిన అవకాశాలు కల్పించినప్పుడే వారు తమ నైపుణ్యాలను ప్రదర్శించగలరని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఇతర విద్యార్థులతో సమానంగా ప్రోత్సహించాలని, వారి ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక విద్యా సమన్వయకర్తలు రామకృష్ణ, బదియా, రామ్‌ నరసయ్య, ప్రధానోపాధ్యాయులు ఎం. ధనుంజయ, లక్ష్మీనారాయణ, రవీందర్‌, దస్తగిరి, కొలిపాక శ్రీనివాస్‌, లక్ష్మయ్య, ఆర్‌. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.