ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
- గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడమే లక్ష్యం
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (హెచ్‌వైఏ-16)లోని క్వాలిటీ సంస్థ ఆధ్వర్యంలో రామన్నపేట మండల పరిధిలోని ఇందిరాపాలనగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లను అందజేశారు.
విద్యార్థులకు చిన్ననాటి నుంచే కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించేందుకు ఈ సహకారం అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంప్యూటర్ల వినియోగం ద్వారా విద్యార్థులకు డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి వి. నరేందర్, సంస్థ ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, మెకల నరేందర్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.