ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు
- మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు
- భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మహబూబాబాద్ జిల్లా, కురవి, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
కురవి మండలానికి చెందిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆమె పేరుతో అర్చకులు పూజలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి సత్యవతి రాథోడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.
ప్రత్యేక పూజల అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నదానంలో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో సర్పంచ్ బాదావత్ లక్ష్మీ రాజు నాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నూతక్కి సాంబశివరావు, సీనియర్ మాజీ వార్డు సభ్యుడు నూతక్కి నరసింహారావు, జిల్లా సీనియర్ నాయకుడు ఐలు నరహరి, మాజీ సర్పంచ్ బోడ శ్రీను నాయక్, సీనియర్ నాయకులు బాదే నాగయ్య, నెహ్రూ, అల్లూరి కిషోర్ వర్మ, కొనతం విజయ్, సంఘం భరత్, కొప్పుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ రామచంద్రయ్యతో పాటు పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.