ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య
విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సమక్షంలో ఘన సన్మానం
నైనాల యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడి పదవీ విరమణ వేడుకలు ఘనంగా
మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఆదర్శ ఉపాధ్యాయుడు భూసాని సోమయ్య అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి కొనియాడారు. నైనాల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన భూసాని సోమయ్యకు శనివారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోమయ్యను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.
ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ సోమయ్య తనదైన బోధనా శైలితో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు విశేషంగా సేవలందించారని పేర్కొన్నారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులతో ఆప్యాయంగా మెలుగుతూ అందరి మన్ననలు పొందారని ప్రశంసించారు. ఆయన సేవలు ఉపాధ్యాయ వర్గానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యసం సంధ్యా రమేష్, ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్, చిర్రా శ్రీనివాస్ గౌడ్, బత్తిని అజయ్ గౌడ్, ఆకుల యాకయ్య, శివార్ల కొమురయ్య, నారబోయిన రమ గుట్టయ్య, గిరిశెట్టి కరుణ, నిమ్మకంటి ఇందిర తదితరులు పాల్గొన్నారు.