BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Thiruvuru: తిరువూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Oct, 2026 - 08:53 PM
8 వీక్షణలు

28 వార్డులు.. 40 పోలింగ్ కేంద్రాలు.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ తిరువూరు మున్సిపాలిటీలోని 28 వార్డులకు సంబంధించి 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బందితో పాటు బ్యాలెట్ పత్రాలను ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ తమ బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మైలవరం వైసీపీ నేత రామచంద్రరావు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. మొత్తంగా తిరువూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయడంతో రేపటి పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు.