స్థానిక సంస్థల ఎన్నికలు ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్‌ను ఎలా మడవాలి
ఓటు హక్కు వినియోగంలో అప్రమత్తత అవసరం బ్యాలెట్ పేపర్ మడతలోనూ జాగ్రత్తలు పాటించాలి
స్థానిక సంస్థల ఎన్నికలు.. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్‌ను ఎలా మడవాలి ఓటు హక్కు వినియోగంలో అప్రమత్తత అవసరం.. బ్యాలెట్ పేపర్ మడతలోనూ జాగ్రత్తలు పాటించాలి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం ప్రతి ఓటరుకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే బ్యాలెట్ పద్ధతిలో జరిగే పోలింగ్‌లో ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్‌ను సరైన విధంగా మడవడం కూడా ముఖ్యమైన అంశం. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది సూచనల మేరకు బ్యాలెట్ పేపర్‌పై తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటు ముద్రించాలి. అనంతరం ముద్రించిన గుర్తు ఇతర భాగాలకు అంటకుండా, ఓటు వివరాలు బయటకు కనిపించకుండా జాగ్రత్తగా మడవాలి. బ్యాలెట్ పేపర్‌ను ఎలా మడవాలనే విషయంలో ఎన్నికల సిబ్బంది ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఆ తర్వాత నిర్దేశించిన బ్యాలెట్ బాక్సులో వేయాలి. ఓటు వేసే సమయంలో తొందరపాటు పనికిరాదు. బ్యాలెట్ పేపర్‌పై ముద్ర వేసే ముందు అభ్యర్థి పేరు, గుర్తును జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకసారి ఓటు ముద్రించిన తర్వాత దానిని మార్చడం సాధ్యం కానందున అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే బ్యాలెట్ పేపర్‌ను మడిచేటప్పుడు అనవసరంగా మడతలు వేయకుండా, ఎన్నికల సిబ్బంది సూచించిన పద్ధతిని అనుసరించాలి. ప్రతి ఓటు విలువైనదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ఎంపిక గ్రామాలు, పట్టణాల అభివృద్ధి దిశను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ మనస్సాక్షి ప్రకారం అభ్యర్థిని ఎంచుకోవాలి. పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిబంధనలను గౌరవించాలి. మీ ఓటు మీ హక్కు.. మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది. ఓటు వేయడం ఎంత ముఖ్యమో, బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసిన తర్వాత దానిని సక్రమంగా మడిచి బ్యాలెట్ బాక్సులో వేయడం కూడా అంతే ముఖ్యం. ఎన్నికల సిబ్బంది సూచనలు పాటిస్తూ ప్రతి ఓటరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.