చీమలపాడులో శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ ప్రారంభం
నాణ్యమైన టపాసులు రిటైల్, హోల్‌సేల్ ధరలకు అందుబాటులో
ఏ.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ దుకాణాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనువంశిక ధర్మకర్త రాజా ఎస్వీఎస్ సుధాకరరావు తనయుడు రాజా నివృత్తరావు ముఖ్య అతిథిగా హాజరై దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రాల నడుమ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. వినియోగదారులకు నాణ్యమైన టపాసులు శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ నిర్వాహకులు మాట్లాడుతూ, దుకాణాన్ని దినదినాభివృద్ధి చేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వివిధ రకాల టపాసులను అందుబాటులో ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రిటైల్, హోల్‌సేల్ ధరలకు టపాసులను విక్రయించనున్నట్లు వెల్లడించారు. దీపావళి సహా వివిధ పండుగలు, ఊరేగింపులు, రాజకీయ పార్టీల కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలకు అవసరమైన టపాసులను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలి చీమలపాడు గ్రామంతో పాటు ఏ.కొండూరు మండలం, తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శ్రీమన్నారాయణ ఫైర్ వర్క్స్ సేవలను వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. జాతీయ రహదారి పక్కన దుకాణం ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు చేరుకోవడం సులభంగా ఉంటుందని తెలిపారు. నాణ్యమైన టపాసులను అందుబాటు ధరలకు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.